దలైలామా కలలో దేవత,110 సంవత్సరాలు బతుకుతారట!

బౌధ్ధ మత గురువు దలైలామా కి కలలో దేవత ప్రత్యక్షమై 110 సంవత్సరాలు బతుకుతానని చెప్పారట.

ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ఒక వీడియో ద్వారా ప్రకటించారు.

లామా గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన భక్తులను ఉద్దేశించి ఓ వీడియో ని విడుదల చేశారు.

అందులో తాను ఆరోగ్యంగా ఉన్నానని, కలలో ధర్మరక్షుకులైన దేవతల్లో ఒకరైన పాల్ డెన్ లామో కలలో కనిపించి, తాను 110 సంవత్సరాలు జీవితం కొనసాగిస్తానని చెప్పిందని అన్నారు.అలాగే భవిష్యత్తులో జరిగే కొన్ని పరిణామాలను సైతం దలైలామా అందులో వివరించినట్లు తెలుస్తుంది.

గత ఏడాది కాలంగా దలైలామా ఛాతీలో ఇన్ ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలోనే భక్తులు ఆందోళన చెందకుండా వీడియో విడుదల చేశారు.

Advertisement

తనకు చికిత్స చేయడంలో సహకరించిన భారతప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలియచేశారు.తన ఆరోగ్యంపై వచ్చే పుకార్లను నమ్మవద్దని కూడా దలై లామా విజ్ఞప్తి చేశారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement