అహింస.. పక్కా తేజా మార్క్ మూవీ..!

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు అభిరాం తన మొదటి సినిమా తేజ డైరక్షన్ లో చేస్తున్నాడు.

తేజ డైరక్షన్ లో వస్తున్న అహింస సినిమా లో అభిరాం, గీతిక జంటగా నటిస్తున్నారు.

రీసెంట్ గా నీతోనే నీతోనే సాంగ్ తో సినిమాపై బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తే సినిమా పక్కా తేజా మార్క్ మూవీగా వస్తుందని అనిపిస్తుంది.

తేజ సినిమాలో లవ్ స్టోరీ కామన్.పేద, ధనిక వర్గాల ఫైటింగ్ కూడా కామన్.

ఫైనల్ గా ప్రేమని గెలిపించుకోవడం కోసం లీడ్ పెయిర్ ఏం చేశారు అన్నదే సినిమా కథ.

Advertisement

దాదాపు తేజా సినిమాలన్ని ఇదే కథలతో వస్తాయి.అహింస సినిమా టీజర్ చూస్తే రొటీన్ హిట్ ఫార్ములానే అనిపిస్తుంది.మరి కొత్తగా ఏమైనా ట్రై చేశాడా అన్నది మాత్రం సినిమా వస్తేనే తెలుస్తుంది.

అభిరాం లోని నటుడిని వెలికితీసే ప్రయత్నంలో తేజ కొంతమేరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.నీతోనే నీతోనే సాంగ్ ఇప్పటికే సినిమాపై మంచి క్రేజ్ ఏర్పరచింది.మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని తేజ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement