హింస పెట్టిన హీరో గారి రెండో సినిమా ఎప్పుడు భయ్యా...?

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అభిరామ్‌( Daggubati Abhiram ) మొదటి సినిమా తో నిరాశ పరిచాడు.

తేజ దర్శకత్వం లో వచ్చిన అహింస సినిమా( Ahimsa Movie ) ప్రేక్షకులకు హింస ను మిగిల్చిన విషయం తెల్సిందే.

అందుకే అభిరామ్ తదుపరి సినిమా విషయం లో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.కానీ బ్యాక్ గ్రౌండ్ వర్క్‌ జరుగుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం అభిరామ్ ( Daggubati Abhiram )తన సొంత బ్యానర్‌ లోనే సినిమా విషయమై చర్చలు జరుపుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.సొంత బ్యానర్‌ లో రానా పలు సినిమా ల్లో నటించాడు.ఇప్పుడు దగ్గుబాటి అభిరామ్ కూడా అదే తరహా లో తన బ్యానర్‌ లో బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక కొత్త దర్శకుడితో అభిరామ్ సినిమా ఉంటుంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయట.

Advertisement

రెండో సినిమా తో అయినా సక్సెస్ ని దక్కించుకోవాలనే ఉద్దేశ్యం తో దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు అంటున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ సినిమా విషయం లో నిర్మాత సురేష్ బాబు( Suresh Babu ) కాస్త ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం రానా కూడా భారీ సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు.

గతంలో మాదిరిగా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను రానా చేయడం లేదు.అందుకు కారణం ఏంటి అనేది తెలియడం లేదు.

కానీ రానా తమ్ముడు అభిరామ్‌ ( Abhiram )మాత్రం సక్సెస్ వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లు చేయాలని ఆశ పడుతున్నాడు.అభిరామ్ సినిమా హీరో గా ఎంట్రీ ఇవ్వడని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆయనకు ఉన్న ఆసక్తి తో సినిమా ఎంట్రీ ఇచ్చాడు.మరి సక్సెస్ దక్కేనా చూడాలి.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు