బాలయ్య వ్యక్తిత్వం గొప్పది.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు బాలయ్య బాబు.

ఇప్పటికే తన గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.తాజాగా మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.

ఇలా వరుసగా నాలుగు సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నారు.ఆ సినిమా మరేదో కాదు బాబీ దర్శకత్వంలో( Director Bobby ) తెరకెక్కిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా.

ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో పెద్ద హిట్గా నిలిచి అదరగొట్టిన విషయం తెలిసిందే.

Daaku Maharaaj Director Valuable Comments On Balakrishna Details, Daaku Maharaaj
Advertisement
Daaku Maharaaj Director Valuable Comments On Balakrishna Details, Daaku Maharaaj

ప్రస్తుతం బాలయ్య బాబు ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో( Anantapuram ) ఏర్పాటు చేయబోతున్నారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ బాబి బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ.నేను బాలయ్య గారిని కలిసిన మొదటి రోజే తన కోసం అడిగితే నేను ఇలా చిరంజీవి( Chiranjeevi ) గారి అభిమానిని అని ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పినపుడు బాలకృష్ణ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఎంకరేజ్ చేసారు.

Daaku Maharaaj Director Valuable Comments On Balakrishna Details, Daaku Maharaaj

వేరే ఏ హీరో దగ్గరైనా ఇలా జరిగిందో లేదో నాకు తెలీదు కానీ బాలయ్య వ్యక్తిత్వం చాలా గొప్పది.ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు అని బాబీ తెలిపారు.ఈ సందర్భంగా బాబీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే బాలయ్య బాబు విషయానికి వస్తే.ఈ సినిమాతో వరుసగా 4 సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, మంగళవారం 2025
విజయ్ దేవరకొండ చేస్తున్న రౌడీ జనార్ధన్ పరిస్థితి ఏంటి..?

ఇప్పుడు అదే ఊపుతో గతంలో నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కబోతున్న అఖండ 2 సినిమాలో నటించిన సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు