దక్షిణ ఆఫ్రికాలో తుఫాన్ విలయం! వందల సంఖ్యలో ప్రజలు గల్లంతు

దక్షిణ ఆఫ్రికా దేశాలలో తుఫాన్ భీభత్సం సృష్టించింది.మొజాంబిక్, మలాని, జింబాబ్వే దేశాలని ఇదాయ్ తుఫాన్ ప్రస్తుతం కుదిపేస్తుంది.

మూడు దేశాలలో భారీగా గా తాకిన తుఫాన్ కారణంగా వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.ఇప్పటి వరకు ఈ తుఫాన్ ప్రభావం కారణం 150 మంది మరణించినట్లు తెలుస్తుంది.

ఇంకా వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు అని తెలుస్తుంది.భారీ వర్షాల కారణంగా రహదారులు, ఇళ్ళు, హాస్పిటల్స్ కొట్టుకుపోవడం వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.

ఇంకా ఆయా దేశాలలో తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ తుఫాన్ ప్రభావం తోదెబ్బ తిన్న ప్రాంతాలలో రెడ్ క్రాస్ లాంటి స్వచ్చంద సంస్థలు సహాయక చర్యలు మొదలెట్టాయి.

Advertisement

మరో వైపు ప్రభుత్వాలు కూడా సహాయక చర్యలు మొదలెట్టాయి.అయితే ఈ తుఫాన్ కారణంగా ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత రాలేదని తెలుస్తుంది.

వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!
Advertisement

తాజా వార్తలు