IPL Tickets :ఐపీఎల్ టికెట్లపై వెలుగులోకి సైబర్ మోసాలు..!!

సైబర్ నేరగాళ్లు( Cyber ​​criminals ) మరోసారి రెచ్చిపోయారు.ఐపీఎల్ టికెట్ల పేరిట భారీగా మోసాలకు పాల్పడుతున్నారు.

టికెట్లను విక్రయిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.దాంతో పాటు క్యూఆర్ కోడ్ పంపుతూ సైబర్ కేటుగాళ్ల ముఠా డబ్బులు వసూలు చేస్తుంది.

అదేవిధంగా డిస్కౌంట్ కూడా ఇస్తామంటూ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సైబర్ మోసాలతో అలర్ట్ అయిన పోలీసులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలోనే టికెట్ల విక్రయాలను పేటీఎం నిలిపివేసింది.కాగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వచ్చే నెల 5వ తేదీన క్రికెట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement
ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు