తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్ మోసం.. రూ.50 వేలు డిమాండ్

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.దీంతో సైబర్ నేరాల( Cyber Crimes ) సంఖ్య భారీగా పెరిగిపోతుంది.

ఏదో రకంగా ప్రజలను బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ రవిగుప్తా( Telangana DGP Ravigupta ) పేరుతో కేటుగాళ్లు మోసానికి తెర తీశారు.

తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్ కు పాల్పడ్డారు.ఈ నేపథ్యంలోనే ఓ వ్యాపారవేత్తకు అగంతకుడు కాల్ చేశఆడు.

వ్యాపారవేత్త కూతురు కాల్ అటెండ్ చేయగా.డ్రగ్స్ కేసులో( Drugs Case ) అరెస్ట్ చేస్తున్నామని బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.దీంతో వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

డీజీపీ డీపీతో వచ్చిన ఈ కాల్ +92 కోడ్ తో ఉందని తెలుస్తోంది.ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు.

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు