వరదల గురించి ముందే తెలిపే సరికొత్త యాప్.. 'ఫ్లడ్‌వాచ్‌'

వర్షాలు, వరదల గురించి ( Floods ) మనకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు.

శాటిలైట్ సమాచారం ఆధారంగా వరదలను అంచనా వేసి ముందుగానే వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉంటారు.

దీని వల్ల ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.సహాయకచర్యల కోసం ముందుగానే రెస్క్యూ సిబ్బందిని సిద్దం చేసి ఉంచుకుంటుంది.

అయితే వరదల గురించి తెలుసుకునేందుకు తాజాగా కేంద్ర జలవనరులశాఖ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.

Cwc Launches Floodwatch Mobile App To Provide Flood Forecasts Details, Flood Wat

ప్లడ్ వాచ్( FloodWatch App ) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.ఈ యాప్ ద్వారా వరద సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని అలర్ట్ కావొచ్చు.దీని వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నుంచి తప్పించుకోవచ్చు.దేశంలో ఎక్కడ వరదలు వచ్చినా, వచ్చే అవకాశం ఉన్నా ఈ యాప్ లో రియల్ టైమ్ సమాచారం( Real Time ) అందుబాటులో ఉంటుంది.338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ యాప్ క్రోడీకరించి సమాచారాన్ని తెలియచేస్తుంది.వరద ప్రభావిత ప్రాంతాలకు మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం చేరవేసి ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ యాప్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం( Central Government ) చెబుతోంది.

Cwc Launches Floodwatch Mobile App To Provide Flood Forecasts Details, Flood Wat
Advertisement
CWC Launches Floodwatch Mobile App To Provide Flood Forecasts Details, Flood Wat

ఇటీవల దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టించాయి.ఉత్తరాదిలో వర్షాలు పెను బీభత్సం సృష్టించాయి.ఇక దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రవాహానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ప్రస్తుతం దక్షిణాదిలో వర్షాలు తగ్గగా.ఉత్తరాదిలో వరద బీభత్సం కొనసాగుతోంది.

వరదలకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.దీంతో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం( Flood Forecasts ) ఇవ్వడం ద్వారా వరదల నుంచి కాపాడుకోవచ్చు.

అందుకే ఈ యాప్ ను ఇప్పుడు లాంచ్ చేశారు.వరద సమాచారాన్ని తెలసుకునేందుకు ఇప్పటికే అనేక యాప్ లో అందుబాటులో వచ్చాయి.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

కానీ అవి ప్రైవేట్ యాప్ లు.ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండదు.

Advertisement

తాజా వార్తలు