భారతదేశంలో కోతిమీరను( Coriander ) ఆకుకూరగా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు.
అంతేకాకుండా వివిధ రకాల ఔషధాలలో, పరిశ్రమలలో కూడా ఎక్కువగా వినియోగించడం వలన ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది.
తేమతో కూడిన వాతావరణం కొత్తిమీర సాగుకు చాలా అనుకూలం.ఎటువంటి నేలలోనైన కోతిమీర సాగు చేయవచ్చు.నేల యొక్క పీహెచ్ విలువ 6.5 నుండి 7.5 వరకు ఉండే నేలలు చాలా అనుకూలం.ఒక ఎకరం నేలలో ఆఖరి దుక్కులో పది టన్నుల పశువుల ఎరువులు, 50 కిలోల వేపపిండి, రెండు కిలోల పాసిలోమైసిస్ లిలసినస్ కలిపి కలియ దున్నాలి.
ఇక మడులను ఒక మీటరు వెడల్పు 30 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్లు తయారు చేసుకోవాలి.ఒక ఎకరాకు 6 కేజీల విత్తనాలు అవసరం.అదే కేవలం వర్షాధార పంట అయితే ఎకరాకు 10 కేజీల విత్తనాలు అవసరం.
నాటే సమయంలో నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి.విత్తనాలను ఓ 15 గంటలపాటు నీటిలో నానబెట్టి, కార్బం డిజమ్ 50% wp మూడు గ్రాములు కలిపి కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి.
విత్తనాలను చల్లకుండా 5 సెంటీమీటర్ల లోతులో కర్రతో సన్నని రంధ్రాలు చేసి విత్తనం వేశాక పైపైన కొంచెం మట్టివేసి ఆ తర్వాత తేలిక పాటి నీటి తడి అందించాలి.
నీటిని పారించకుండా డ్రిప్ విధానం( Drip ) ద్వారా నీటిని అందించడం వలన మొక్క కావలసిన నీరు సమృద్ధిగా అందడంతో పాటు, చాలావరకు కలుపు సమస్యలు ఉండవు.శీతాకాలంలో పది రోజులకు ఒకసారి, వేసవికాలంలో ఐదు రోజులకు ఒకసారి పంటకు నీరు అందించాలి.పైన చెప్పిన పద్ధతుల ద్వారా కొత్తిమీర సాగు చేస్తే కలుపుల ఖర్చు, రసాయన పిచికారీ ల ఖర్చు ఆదా అవడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి( High yield ) పొంది మంచి ఆదాయం పొందవచ్చు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy