పిల్లాడిని మింగిదన్న అనుమానంతో మొసలికి గ్రామస్థుల చిత్రహింసలు

అనుమానం పెనుభూతం అవుతుంది అనే దానికి నిదర్శనమే ఈ ఉదంతం.సరైన ఆధారాలు లేకపోయినా.

అనుమానంతో దహించి వేస్తారు కొందరు.అయితే ఈ అనుమానమో ఓ మొసలి పాలిట పెను శాపంగా మారింది.

అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.మధ్య ప్రదేశ్ ష్యోపుర్ జిల్లా రిఝెంటా గ్రామంలో పదేళ్ల బాలుడు అతర్ సింగ్ చంబల్ నదిలో స్నానానికి వెళ్లాడు.

స్నానానికి వెళ్లిన వాడు కనిపించకుండా పోయాడు.నదిలోని మొసలి బాలుడిని మింగేసిందని గ్రామస్థుల అనుమానం.

Advertisement

వారి అనుమానమే మొసలి పాలిట శాపంగా మారింది.ఓ పెద్ద వల తెచ్చి నదిలోని మొసలిని పట్టుకున్నారు.

ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు.బాలుడు కడుపులో సజీవంగా ఉన్నాడని ఎలాగైనా బయటకు కక్కేలా చేయాలని నానా ప్రయత్నాలు చేశారు.

లోపల ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందాలనే ఉద్దేశంతో మొసలి నోరు తెరిచి.మళ్లీ నోరు మూయకుండా పెద్ద కర్రను అడ్డుగా పెట్టారు.

ఇలా అయితే లాభం లేదనుకొని పొట్టి చీల్చి బాలుడని తీయానుకున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

గ్రామస్థులకు నచ్చజెప్పి మొసలిని విడిపించారు.తిరిగి నదిలో విడిచి పెట్టారు.

Advertisement

బాలుడి కోసం నదిలో గాలించగా.మంగళ వారం ఉదయం శవమై కనిపించాడు.

అతడి శరీరంపై గాయాలు ఉన్నాయి.అయితే బాలుడి మృతికి కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని అధికారులు చెప్పారు.

తాజా వార్తలు