ఐఐటీ క్యాంపస్‌లో మొసలి.. ఫిమేల్ స్టూడెంట్స్ ఏం చేశారో చూస్తే అవాక్కవుతారు..

ముంబైలోని ఐఐటీ బాంబే( IIT Bombay ) క్యాంపస్‌లో మార్చి 23న ఒక సీన్ చూసి అందరూ అదిరిపోయారు.

ఏకంగా ఓ భారీ మొసలి( Crocodile ) క్యాంపస్‌లో దర్జాగా తిరుగుతూ కనిపించింది.

దీంతో ఫిమేల్ స్టూడెంట్స్, అక్కడి సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.విషయం క్షణాల్లో పాకిపోయింది, ఆ మొసలి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అయ్యాయి.

చూసినవాళ్లంతా "అమ్మో, ఐఐటీలో మొసలా?" అంటూ నోరెళ్లబెట్టారు.స్థానికంగా తెలిసిన సమాచారం ప్రకారం, ఈ మొసలి క్యాంపస్‌కు దగ్గర్లోనే ఉన్న పోవై సరస్సు నుంచి దారి తప్పి వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు.

అర్ధరాత్రి టైంలో, సరస్సు పక్కన ఉన్న రోడ్డుపై మెల్లగా నడుస్తూ కనిపించిందట.కాసేపు అక్కడే సేదతీరి, మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోయింది.దాన్ని చూసినవాళ్లు కొద్దిసేపు బిత్తరపోయారు.

Crocodile In Iit Bombay Campus Video Viral Details, Iit Bombay Crocodile, Crocod
Advertisement
Crocodile In IIT Bombay Campus Video Viral Details, IIT Bombay Crocodile, Crocod

మొసలి క్యాంపస్‌లోకి వచ్చిందన్న విషయం తెలియగానే అధికారులు అలర్ట్ అయ్యారు.వెంటనే లోకల్ పోలీసులకు, అటవీ శాఖ వాళ్లకు కబురు పెట్టారు.ముంబై పోలీసులు( Mumbai Police ) కూడా స్పాట్‌కి చేరుకుని, జనాలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు.

పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుండగానే, ఆ మొసలి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సైలెంట్‌గా తిరిగి చెరువులోకి వెళ్లిపోయింది.అదృష్టం కొద్దీ ఎవరికీ ఏమీ కాలేదు.

Crocodile In Iit Bombay Campus Video Viral Details, Iit Bombay Crocodile, Crocod

వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్ దీన్ని చూసి ఓ అంచనాకు వచ్చారు.ఇది ఆడ మొసలి అయి ఉండొచ్చని, గుడ్లు పెట్టడానికి సేఫ్ ప్లేస్ (గూడు) వెతుక్కుంటూ ఇలా బయటకు వచ్చి ఉండొచ్చని పవన్ శర్మ అనే నిపుణుడు చెప్పారు.ఈయన రెస్క్యూఇంక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ (RAWW) వ్యవస్థాపకుడు, గౌరవ వన్యప్రాణి వార్డెన్ కూడా.

గూడు కట్టుకోవాలనే దాని సహజమైన ఆలోచన వల్లే ఇలా జనాల్లోకి వచ్చిందని ఆయన వివరించారు.ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా, స్టూడెంట్స్ సేఫ్టీ గురించి మాత్రం ఆందోళన మొదలైంది.

ఇండియాలో మన డైరెక్టర్లను మించిన డైరెక్టర్స్ లేరా..?
శిల్పాలు చెక్కుతున్న రోబోలు.. శిల్పులకు కూడా గడ్డు కాలం ఎదురయ్యిందా..?

థానే టెరిటోరియల్ వింగ్‌కు చెందిన ముంబై రేంజ్ ఆఫీసర్లు ఇప్పుడు ఆ ఏరియాని నిశితంగా గమనిస్తున్నారట.ప్రజలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని, మొసళ్లు తిరిగే చోట్లకు వెళ్లొద్దని సూచించారు.

Advertisement

సాధారణంగా పోవై సరస్సులోనే ఈ మొసళ్లు ఉంటాయని, ఇలా జనావాసాల్లోకి రావడం చాలా అరుదు అని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తాజా వార్తలు