ఆ రూల్ ఉల్లంఘించిన టీమిండియా.. విమర్శిస్తున్న క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్‌లో వన్డే, టీ20, టెస్ట్ అనే మూడు ఫార్మాట్లు ఉంటాయనే విషయం తెలిసిందే.

అయితే సాధారణంగా అన్ని దేశాల టీమ్స్ స్పెషల్ కలర్ జెర్సీ ధరించి ఇతర టీమ్స్ నుంచి తమను తాము వేరుగా ప్రదర్శించుకుంటారు.

మన భారత క్రికెట్ ప్లేయర్లు వన్డే టీ20 ఫార్మాట్స్‌లో బ్లూ కలర్ జెర్సీ ధరిస్తారు.ఈ రెండు ఫార్మాట్లోనే టీమ్స్ కలర్‌ఫుల్ జెర్సీలు ధరించవచ్చు.

కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఎవరైనా సరే వైట్ జెర్సీ ధరించాల్సిందే.లేదంటే ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసినట్లే అవుతుంది.

కాగా టీమిండియా రీసెంట్ గా ఈ రూల్ ఉల్లంఘించి విమర్శల పాలవుతోంది.వివరాల్లోకెళితే.

Advertisement

కొద్ది రోజుల క్రితం ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్స్ వైట్ డ్రెస్ కాకుండా లైట్ ముదురు గోధుమ రంగు జెర్సీ వాడారు.దాంతో టెస్ట్ సిరీస్‌లో వైట్ జెర్సీ ధరించాలన్న ఐసీసీ రూల్‌ను టీమిండియా బ్రేక్ చేసింది.

ఇదే విషయాన్ని క్రికెట్ ఫ్యాన్స్ గుర్తించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా బీసీసీఐ టీమిండియా ప్లేయర్స్‌ జెర్సీ కలర్‌ను ఎందుకు చేంజ్ చేశారని ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

కానీ ఫ్యాన్స్ మాత్రం టీమిండియాను విమర్శిస్తున్నారు.ఇలా రూల్స్ బ్రేక్ చేయడం బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు.ఓల్డ్ వైట్ జెర్సీ కలర్‌యే బాగుందని అంటున్నారు.

ఐసీసీ రూల్స్ పాటించకపోతే వేరే టీమ్స్‌కి మనకి తేడా ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.మరి ఈ విషయంపై టీమిండియా తో పాటు బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు