వరుస అవకాశాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్...

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో ప్రియాంక మోహన్( Priyanka mohan ) సక్సెస్ ఫెయిల్యూర్స్ తో ఏ విధమైన సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది.

కవ్వించే అందాలతో కుర్రకారు గుండెలను పిండేస్తున్న అమ్మడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ధనుష్( Pawan kalyan, Dhanush ) లతో కలిసి నటిస్తుంది.

ఈ అందాల ముద్దుగుమ్మ ఓంధ్ కథే హెల్లా అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.ఇక తెలుగు ప్రేక్షకులకు నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచమైంది .అయితే ఈ సినిమా మాత్రం అమ్మడుకి ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదనే చెప్పాలి.ఇక తెలుగులో అమ్మడి తొలి సినిమా విజయాన్ని అందుకోనప్పటికీ , భామ అందానికి, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు మన ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఈ నేపథ్యంలోనే ప్రియాంక కి శర్వానంద్( Sharwanand ) నటించిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందిపుచ్చుకుంది.అయితే ఈ సినిమా కూడా అమ్మడుకి బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది .ఇక బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ కూడా ప్రియాంక అరుళ్ మోహన్ తన కాతాలో వేసుకునే సరికి టాలీవుడ్ నుంచి అవకాశలు తగ్గుతూ వచ్చాయి.సరిగ్గా అదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమ ఈ బ్యూటీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది.

శివ కార్తికేయన్ తో కలిసి చేసిన డాక్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.ఇదే సినిమా వరుణ్ డాక్టర్ గా తెలుగులోనూ సక్సెస్ ని సొంతము చేసుకుంది.

Advertisement

ఇదే సమయంలో తమిళ్ లో సూర్యతో నటించిన ఈటీ, శివ కార్తికేయన్ తో జంటగా నటించిన కాలేజ్ డాన్ సినిమాలు కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో ప్రియాంక మరోసారి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన OG చిత్రంలో( OG Movie ) నటిస్తుండగా , ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ మధ్యే పవన్ కళ్యాణ్ , ప్రియాంక ల మధ్య ఓ సాంగ్ షూట్ కూడా జరిగిందని వార్త .మరోవైపు చూసుకుంటే కోలీవుడ్ లో ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ అనే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ లోను నటిస్తుంది.ఇక ఈ రెండు క్రేజీ సినిమాలైనా అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేస్తాయని ప్రేక్షకులు అంటున్నారు.

అయితే ఇక్కడే అసలు మాటర్ ఉంది.

చేతిలో రెండు అవకాశఘాలున్నప్పటికీ, అంతకముందు సినిమాలు చేసిన , ఇన్నేళ్ళుగా కొన్ని హిట్లు ఉన్నప్పటికీ స్టార్ స్టేటస్ కైవసం చేసుకోకపోవడనికి కారణం గ్లామర్ షో కు దూరంగా ఉందని కామెంట్స్ సైతం ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.ఈ మాట అమ్మడి చెవిన పడిందేమో ఏమో ఇక అమ్మడు అటు సినిమాలతో బిజీ గా ఉంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ .అబిమానాలకు అందాల కనులవిందు చేస్తూ మరింత దగ్గరయ్యే ప్రయత్నామ్ చేస్తుంది.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరింత దూకుడు పెంచింది.

రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తుంది.తాజాగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న భామ వయ్యారాలు ఒలకబోస్తూ తెగ అట్రాక్ట్ చేస్తున్న పిక్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు