తెలంగాణలో కాంగ్రెస్‎తో కుదరని సీపీఎం పొత్తు..!

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.పొత్తులో భాగంగా సీపీఎం అడిగిన సీట్లను కాంగ్రెస్ ఇచ్చేందుకు నిరాకరిస్తుందని సమాచారం.

సీపీఎం కోరిన వైరా, మిర్యాలగూడ నియోజకవర్గ స్థానాల టికెట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సీపీఎం రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని తెలుస్తోంది.

మరోవైపు సీపీఐకి కాంగ్రెస్ కొత్తగూడెం స్థానాన్ని ఫైనల్ చేయగా మరో స్థానం కోసం సస్పెన్స్ కొనసాగుతోంది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement