కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర

కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

కడపలోని కన్యా తీర్థం నుంచి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర ప్రారంభంకానుంది.

ఈ సందర్భంగా ఆ పార్టీ నేత నారాయణ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలకు గుణపాఠమని చెప్పారు.స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు.

స్టీల్ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని రాష్ట్ర ప్రభుత్వం అడగలేకపోయిందని తెలిపారు.వైసీపీ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం మెడలు వంచే వరకు ఉద్యమం ఆగదని నారాయణ స్పష్టం చేశారు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...