బిగ్ బాస్ షో పై మరోసారి సీరియస్ అయినా సీపీఐ నారాయణ..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ షో లో మొట్టమొదటి రోజే హౌస్ లోకి 20 మంది సభ్యులను పంపించడం సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే మరోసారి సీపీఐ నారాయణ.బిగ్ బాస్ షో పై విరుచుకుపడ్డారు.

కాసులకు కక్కుర్తి పడేవాళ్ళు ఉన్నంతకాలం వరకు ఇటువంటి షోలు ఉంటాయని అన్నారు.ఇటువంటి రియాల్టీ బిగ్ బాస్ షోలతో ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు అనేది ప్రేక్షకులు ప్రశ్నించాలని సూచించారు.

బిగ్ బాస్ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సమయాన్ని వృధా చేసే కార్యక్రమంగా బిగ్ బాస్ షోని అభివర్ణించారు.

Advertisement

ఏది ఏమైనా బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి సీపీఐ నారాయణ కాంట్రవర్సీ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. గతంలో ఏకంగా బిగ్ బాస్ షో హోస్ట్ గా చేస్తున్న నాగార్జునపై కూడా ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచాలనం సృష్టించాయి.

ఇప్పుడు మరోసారి ఆ తరహాలోని వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు