బస్సును చూసి బెదిరిన కాడేడ్లు కుంటలో పడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆర్టీసీ బస్సును చూసి బెదరిన కాడెడ్లు పరుగు తీసి పక్కనే ఉన్న కుంటలో పడి మృతి చెందిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం రాత్రి జరిగింది.

బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.

సీతారాంపురం గ్రామానికి చెందిన రైతు చేగూరి పాండు పత్తి చేనులో గుంటుక కొట్టి తన రెండు ఎడ్లను కాడితో దొడ్డి వైపు వెళుతుండగా అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును చూసి ఒక్కసారిగా బెదరడంతో పక్కన ఉన్న కుంటలో పడి అక్కడికక్కడే మృతి చెందాయి.సుమారు లక్షా యాభై వేల విలువచేసే ఎడ్లు మరణించడంతో బాధిత రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాడెద్దులు మరణించడంతో జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement

Latest Video Uploads News