ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ గా ఆవు.... డబ్బు తీసుకోవడానికి వచ్చిన వారి కష్టాలను వీడియోలో చూడండి...

ప్రస్తుత సమాజంలో ఏ చిన్న ఆశ్చర్యకరమైన విషయం జరిగితే మొదటగా అది వీడియో రూపంలో సోషల్ మీడియాలో కి వచ్చి చేరుతుంది.

ఈ మధ్యకాలం లో ఆవులు ఎక్కువగా రోడ్లపైకి వస్తున్నాయి.

ఆవుల వల్ల రోడ్లపై కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.తాజాగా ఒక ఆవు పశువుల కొట్టంలో ఉండలేక ఏటీఎం సెంటర్ లో ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది.

ఆవు ఏటీఎం సెంటర్‌ని పూర్తి గోశాలగా మార్చేసింది.ఇక డబ్బు తీసుకోవడానికి వచ్చిన ప్రజల కష్టాలను ఆవు ఏమాత్రం పట్టించుకోలేదు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో విపరీతం గా వైరల్‌ అవుతుంది.ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌ లోని రేవా గ్రామంలో జరిగింది.

Advertisement

ఆవుపేడ తో నిండిపోయిన ATM మెషిన్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడంలో స్థానికులు ఇబ్బంది పడుతున్న వీడియోను ఒక జర్నలిస్ట్ తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు.ఏటీఎం సెంటర్‌లోపల ఎటు చూసినా ఆవుపేడతో నిండిపోయింది.

ఇక ఆ ఆవు ATM మెషిన్ ముందే పడుకుని విశ్రాంతి తీసుకుంటుంది.

మిషిన్‌లో ఉన్న డబ్బంతా నా సొంతమే అన్నట్టుగా ఉంది.ఇక దాంతో ఏటీఎం లోపలికి వచ్చినవారు వారి ముక్కు మూసుకుని నగదు తీసుకోవడానికి శుభ్రమైన ప్రదేశంలో జాగ్రత్తగా అడుగు పెట్టడం మనం వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోకి నెటిజన్లు సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఆవు గురించి ఆందోళన చెందుతున్న కొంత మంది నెటిజన్లు అనారోగ్యం కారణంగా విరేచనాలు కావచ్చు.దానిని పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాలండి అంటూ కామెంట్‌ చేశారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఏటీఎం సెంటర్ కి సెక్యూరిటీ గార్డ్ లేనందున ఏసీలో కూర్చుని సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement