సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పోలింగ్ ముగిసింది.2019 కంటే ఊహించని విధంగా పోలింగ్ శాతం పెరగటంతో ప్రతిపక్షాలు సంతోషంగా ఉన్నాయి.

కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు.

మరోపక్క గ్రామీణ ప్రాంతాలలో అత్యధికమైన ఓటింగ్ తో పాటు మహిళా ఓటింగ్ అధిక శాతం ఉండటంతో కచ్చితంగా.తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ( YCP) నేతలు అంటున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా పల్నాడు మరికొన్ని చోట్ల ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.వైసీపీ.

కూటమి పార్టీల మధ్య గొడవలు ఉన్న కొద్ది పెరుగుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్నది టెన్షన్ గా మారింది.ఇదిలా ఉంటే వైసీపీ అధినేత సీఎం జగన్ విదేశీ పర్యట( CM Jagan foreign visit )న కోసం విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.దీంతో సీబీఐ( CBI ).గతంలోనే విదేశీ పర్యటనలకు వెళ్ళటం జరిగిందని విచారణ జరుగుతుందని.అనుమతి ఇవ్వొద్దని వాదనలు వినిపించింది.

దీంతో వాదనలు మొత్తం విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది.తాజాగా మే 14వ తారీకు జగన్ విదేశీ పర్యటనకు కోర్ట్ అనుమతి ఇవ్వటం జరిగింది.

దీంతో మే 17 నుంచి జూన్ మొదటి తారీకు వరకు కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్.వెళ్ళనున్నారు.

జూన్ 4వ తారీఖు ఏపీ ఫలితాలు వెలువడనున్నాయి.

వైరల్ వీడియో : అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!
Advertisement

తాజా వార్తలు