మాచర్లకు వెళ్ళకూడదు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు ఆదేశాలు..!!

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై( MLA Pinnelli Ramakrishna Reddy ) కేసు నమోదు కావడం తెలిసిందే.

అయితే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును( High Court ) ఆశ్రయించడంతో.

ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేయడం జరిగింది.

సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు విధించింది.తదుపరి విచారణను జూన్ 6 వాయిదా వేయడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు( Macherla ) వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి( Narasaraopeta Counting Center ) మాత్రం వెళ్ళవచ్చని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.ఈసారి ఏపీ ఎన్నికలలో కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

పల్నాడు, అనంతపురం, తిరుపతి.జిల్లాలలో భారీగా గొడవలు జరిగాయి.

మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం( EVM ) బాక్స్ పగలగొట్టిన వీడియో బయటకు రావడం సంచలనం గా మారింది.దీంతో కేసు నమోదు అయింది.

ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేయడంతో జూన్ ఆరో తారీకు వరకు.పిన్నెల్లిని.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్ 

అరెస్టు చేయొద్దని కోర్ట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు