మైనర్ బాలికపై అత్యాచారం కేసు వెల్లడి! పాస్టర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష!

రెండేళ్ల క్రితం కేరళలో ఓ మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం చేసిన ఘటన ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఏడాది తర్వాత ఆ మైనర్ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో ఆ సంఘటన కేరళ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.మహిళా సంఘాలు హిందుత్వ సంస్థలు బాధితురాలికి పాస్టర్ పై యాక్షన్ తీసుకోవాల్సిందిగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

దీంతో మా పాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు.పోక్సో చట్టం కింద పాస్టర్ ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు.

ఈ కేసులో మైనర్ బాలిక కి పుట్టిన బిడ్డకి డీఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత పాస్టర్ ఆమె గర్భవతి కావడం కారణమని నిర్ధారించిన న్యాయస్థానం అతనికి తాజాగా శిక్ష ఖరారు చేసింది.బాలికపై అత్యాచారం చేసి పాస్టర్ కి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Advertisement

ఇక పాస్టర్ కి సహకరించిన మరో ఐదు మంది కూడా కోర్టు శిక్ష ఖరారు చేయడం విశేషం.పాస్టర్ కి శిక్ష ఖరారు చేసినట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించడం తో ఇప్పుడు బాధితురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఈ సంఘటనపై ఇప్పటివరకు పాస్టర్ పనిచేసే క్రిస్టియన్ మిషనరీ స్పందించలేదని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు