500 రూపాయల కోసం దంపతులు ఆత్మహత్య..!!

సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి.పేదవాడు మొదలుకొని ధనవంతుడు వరకు ఎవరూ కూడా ఒత్తిడిని జయించలేకపోతున్నారు.

ఇదే సమయంలో చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసేసుకుంటున్నారు.చిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఇటువంటి రకమైన ఆలోచన ధోరణితోనే వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా కుటుంబ జీవితాలలో చాలా పరిస్థితులు మారుతున్నాయి.ఒకప్పుడు ఇంటిళ్లపాది అందరూ హాయిగా బతికే పరిస్థితి ఉండేది.

కానీ ఇప్పుడు సమాజం కోసం ఇతరుల కోసం అన్నట్టు.ఫోటోలు సోషల్ మీడియా లోనే బంధాలు తప్ప వాస్తవంలో ఎవరు బతకని పరిస్థితి నెలకొంది.

Advertisement

ఇదే సమయంలో చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు విడిపోతున్నారు.అదే సమయంలో ఒక్కోసారి కొన్ని విషయాలలో పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా 500 రూపాయల కోసం దంపతులు ఉరివేసుకొని చనిపోయారు.

పూర్తి విషయంలోకి వెళ్తే కృష్ణాజిల్లా గుడివాడలో( Gudivada ) చిన్న గొడవకి భార్య భర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.దంపతులు రాంబాబు (45),( Rambabu ) కనకదుర్గ (40)( Kanakadurga ) మధ్య 500 రూపాయల కోసం వివాదం మొదలైందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో వివాదం ఉన్నకొద్ది పెరగటంతో భర్త ముందు ఉరివేసుకొని మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న భార్య కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో స్థానికులు ఎంతో విభ్రాంతికి గురయ్యారు.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?
Advertisement

తాజా వార్తలు