తెలంగాణలో ఓట్ల లెక్కింపు.. కాంగ్రెస్ ఖాతాలోకి మరో సీటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ ఖాతాలోకి మరో విజయం చేరింది.

రామగుండంలో కాంగ్రెస్ గెలుపొందింది.ఈ మేరకు పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ విజయం సాధించారు.

బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై ఆయన భారీ మెజార్టీతో గెలుపును కైవసం చేసుకున్నారు.తాజాగా మక్కాన్ సింగ్ గెలుపుతో కాంగ్రెస్ ఖాతాలో మూడు సీట్లు చేరాయి.

అయితే ఉమ్మడి ఖమ్మంలో ఆధిక్యతలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు