కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగింది..: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.ఈ క్రమంలో అభివృద్ధికి గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పారు.

అభివృద్ధి మంత్రంతోనే గుజరాత్ లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందన్నారు.ఈ తరహాలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంతగానో డెవలప్ అవుతున్నాయన్న రాజ్ నాథ్ సింగ్ పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో బీఆర్ఎస్ చెప్పాలని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని, కేసీఆర్ కు కుటుంబమే మొదటి ప్రాధాన్యతని ఆరోపించారు.

Advertisement

తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీల సర్కార్ అని విమర్శించారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు