గుండెపై కరోనా ప్రభావం ఎంత..!?

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చైనాలోని వుహాన్ పుట్టిన ఈ కరోనా వైరస్ కు సంబంధించి రోజుకో సమస్య తెరమీదకు వస్తుంది.ఈ వైరస్ ను ఆదిలోనే అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీకి పరిశోధకులు కష్టపడుతుంటే ఇప్పుడు మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

ఏంటి అంటే? కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించడానికి కారణం మన శరీరంలో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్‌.ఇంకా అవి దేహంలో ఉన్నట్లే మన గుండెపై కూడా ఈ రిసెప్టార్స్‌ ఉంటాయి.

వీటి ద్వారానే కరోనా వైరస్‌ కొందరిలో గుండె కండరంలోకి ప్రవేశించి గుండె కండరాన్ని బలహీన పరిచి దారుణంగా దెబ్బతీస్తుంది అని అంటున్నారు వైద్యులు.కాగా గుండె జబ్బులు ఉన్న, గతంలో గుండెపోటు వచ్చిన వారి పరిస్థితి విషమించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.

Advertisement

అయితే ఇవి హార్ట్ అటాక్‌ రూపంలో కనిపిస్తాయట.కొందరిలో హార్ట్‌ ఫెయిల్యూర్‌కూ దారితీస్తాయి.

మరికొందరిలో గుండె స్పందనల తాలూకు దెబ్బతీస్తాయి.గుండె స్పందనలో కూడా తేడా వస్తుంది.

కాసేపు వేగంగా, కాసేపు నెమ్మది ఇర్రెగ్యులర్‌గా గుండె కొట్టుకుంటుందట.అందుకే ఈ కోవిడ్ సమయంలో గుండెజబ్బులు ఉన్నవారు మరింత ఎక్కువగా మెడికల్‌ కేర్, మెడికల్‌ అటెన్షన్‌లో ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు