కొత్తిమీర‌తోనూ చ‌ర్మాన్ని మెరిపించుకోవ‌చ్చు.. తెలుసా..?

కొత్తిమీర‌.దీని రుచి చూడ‌ని వారు చాలా అరుద‌నే చెప్పాలి.వంట‌ల్లో విరివిరిగా వాడే కొత్తిమీర.

కూర‌కు మంచి సువావన, రుచి ఇవ్వ‌డ‌మే కాదు.ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేకూర్చుతుంది.

ఎందుకంటే.కొత్తిమిరి నిండా ఉన్న విటమిన్లు, ఖనిజ లవణాలే ఇందుకు కార‌ణం.

ప్ర‌తిరోజు కొత్తిమీర ర‌సం తాగితే.ర‌క్త‌హీన‌త త‌గ్గించ‌డంతో పాటు కొలెస్టరాల్‌ను కూడా నివారిస్తుంది.

Advertisement
How To Have Beautiful Skin With Coriander Leaves, Coriander Juice, Skin Benefits

అంతేకాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరిపించ‌డంలోనూ కొత్తిమీర గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.ముఖ్యంగా ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు, డ్రై స్కిన్ ఇలా త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌కు కొత్తిమీర‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి కొత్తిమీర‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.అందులో ముందుగా.

కొత్తిమీర‌ను తీసుకుని బాగా పేస్ట్ చేసి.అందులోని ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సానికి కొద్దిగా నిమ్మ‌రసం చేర్చి.ముఖానికి, మెడ‌కు బాగా ప‌ట్టించాలి.

How To Have Beautiful Skin With Coriander Leaves, Coriander Juice, Skin Benefits
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జులై 8, గురు వారం, 2021

పావుగంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.ముఖంపై ఉన్న మ‌లినాలు తొల‌గి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.మ‌రియు ఈ ప్యాక్ వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Advertisement

ప్ర‌తి రోజూ రాత్రి నిద్రంచే ముందు కొత్తిమీర రసం పెదవులపై అప్లై చేసి.ఉద‌యం గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేడ‌యం వ‌ల్ల పెద‌వుల న‌లుపు త‌గ్గి.మంచి క‌ల‌ర్ సంత‌రించుకుంటాయి.

అలాగే కొత్తిమీర పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా శెన‌గ‌పిండి, పెరుగు మ‌రియు చిటికెడు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా ప‌ట్టించి.పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా మారుతుంది.మ‌రియు ముఖం కాంతివంతంగా మారుతుంది.

తాజా వార్తలు