కాంట్రాక్ట్ వెడ్డింగ్: ప్రతిరోజూ చీర కట్టుకోవాలి.. భర్తతోనే పార్టీలకు వెళ్లాలట!

పెళ్లి చేస్కున్న తర్వాత హాయిగా చూస్కుంటామని, ఆస్తులు రాసిస్తామని హామీలు ఇచ్చుకోవడం.అందుకోసం సంతకాలు చేసుకోవడం వంటివి విన్నాం కానీ.

ఓ జంట మాత్రం ప్రతిరోజూ చీర కట్టుకోవాలి, భర్తతో మాత్రమే పార్టీలకు వెళ్లాలనే షరతులను పెట్టుకున్నాయి.ఉత్తి మాటల మీద చెప్తే.

అవి పాటించకపోతే అడగలేమనే ఉద్దేశంతో.ఓ జంట కాంట్రాక్ట్ పెళ్లి చేస్కుంది.

అంటే వివాహ తంతు పూర్తి అయిన తర్వాత తమ షరతులకు సంబంధించిన ఓ పెద్ద కాంట్రాక్ట్ పేపర్ ను తీసుకొచ్చారు.అందులో వధూవరులిద్దరూ సంతకాలు చేసి ఆ షరతులు తాము పాటిస్తామని తెలిపారు.

Advertisement

మనం ఎన్నో రకాల పెళ్లిళ్ల గురించి చూశాం కానీ ఈ కాంట్రాక్ట్ పెళ్లి గురించి.అందులోనూ చిన్న చిన్న విషయాలకే సంతకాలు పెట్టుకోవడం అస్సలే చూసి ఉండం.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.అసోంకు చెందిన శాంతి, మింటు ఈ కాంట్రాక్ట్ వివాహం చేస్కున్నారు.

పెళ్లి తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి అంచాలను పెద్ద కాగితంపై ముద్రించారు.ఇందులో ఆదివారం ఉదయం చేసుకోవాల్సిన అల్పాహారం గురించి, నెలకోసారి పిజ్జ తినాలని, ఇంట్లో చేసిన వంటనే ప్రతిరోజూ భుజించాలని రాసుకున్నారు.కానీ వంట ఎవరు చేయాలన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ఇద్దరూ కలిసే జిమ్ కి వెళ్లాలి, పార్టీలో మంచి మంచి ఫొటోలు దిగాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి షాపింగ్ చేయాలి వంటి వాటిని కూడా అందులో చేర్చారు.

రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?
Advertisement

తాజా వార్తలు