కొలిక్కిరాని వైసీపీ ఒంగోలు సీటు పంచాయతీ..!

ప్రకాశం జిల్లా వైసీపీలో ఒంగోలు సీటు పంచాయతీ ఇంకా కొలిక్కిరాలేదు.నిన్న సీఎం జగన్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కలిశారు.

గిద్దలూరు లేదా ఒంగోలులో ఎక్కడో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని బాలినేనికి సీఎం జగన్ సూచించారని తెలుస్తోంది.అదేవిధంగా మాగుంటకు పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరని సమాచారం.

ఈ క్రమంలోనే రానున్న రెండు రోజుల్లో ఒంగోలు సీటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement