అధిష్టానం సూచన మేరకు కొడంగల్ నుంచి పోటీ..: రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తానేనని పేర్కొన్నారు.

కొడంగల్ ను మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పి మోసం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రానున్న ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కొడంగల్ నుంచే దరఖాస్తు చేస్తానని చెప్పారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.4 వేల పెన్షన్ అందిస్తామన్నారు.అదేవిధంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.

ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ నేత గుర్నాథ్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)