మహా కూటమిలో మహా తలపోట్లు !

తెలంగాణ లో విపక్షాలన్నీ కలిసి మహాకూటమి గా ఏర్పడ్డాయి.టీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చెయ్యడమే కాకుండా.

విపక్ష పార్టీలన్నీ కలిసి.అధికారం పంచుకోవాలనే ఆలోచనతో ఉత్సాహంగా కూటమిగా ఎరపడ్డాయి.

ఇందులో.కాంగ్రెస్‌, టీడీపీ, టీజెఎస్‌, సీపీఐ పార్టీలు కలసి మహాకూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.

అయితే.సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో కూటమి లోని పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి.

Advertisement

దీనిపై అనేక చర్చలు.సమావేశాలు.

తర్జనభర్జనలు ఎన్ని జరిగినా కూటమిలో పార్టీల మధ్య విభేదాలు పోవడంలేదు.మరో వైపు టీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండాగా కూటమి ఇంకా బాలారిష్టాలనే ఎదుర్కుంటోంది.

తెలంగాణలోని 119 స్థానాల్లో 95 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది.మిగిలిన 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని భావిస్తోంది.14 స్థానాలను టీడీపీ, మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.అయితే టీజేఎస్ మాత్రం తమకు 11 స్థానాలను కావాలని కోరుతోంది.

సీపీఐ కనీసం నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలను కోరుతోంది.అయితే వారు అనుకున్నన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇష్టపడడంలేదు.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కు ఇచ్చింది.స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది.

Advertisement

దీనిపై కోదండ రామ్ గుర్రుగా ఉన్నారు.సీపీఐకు మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.

కానీ, నాలుగు ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐ కోరుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కొత్త ప్రతిపాదన సీపీఐ కి వచ్చింది.బెల్లంపల్లి, ఆసిఫాబాద్, వైరా అసెంబ్లీ స్థానాలను కేటాయించనున్నట్టు కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది.అయితే కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది.

కానీ కొత్తగూడెం సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒప్పుకోవడం లేదు.దీంతో కూటమి నుంచి తప్పుకొనేందుకు సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది.

మరో వైపు టీజెఎస్ ఛీఫ్ కోదండరామ్ మగ్థూమ్ భవన్‌కు వెల్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.దీంతో సీపీఐతో సీట్ల సర్దుబాటు అంశంపై కోదండరాం కీలక చర్చలు జరిపారనే వార్తలు వినిపించాయి.

సీపీఐతో తాను మధ్యవర్తిత్వం చేయడానికి రాలేదని వివరణ ఇచ్చారు.సీట్ల సర్దుబాటు విషయంలో సీపీఐ ఆలోచన ఏంటో తెలుసుకుందామని వచ్చానని తెలిపారు.

తమకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని.సీట్లు విషయంలో స్పష్టత వచ్చిన తరువాత అభ్యర్థుల గురించి ఆలోచిస్తామని కోదండరాం చెబుతున్నారు.

తాజా వార్తలు