ఆరోపణలు చేసాడు ... సాగనంపుతున్నారు ! కాంగ్రెస్ రెబెల్ పై వేటు..?

తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నేతలకు తీవ్ర అసంతృప్తి మిగిల్చింది.ముఖ్యంగా.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చుపెట్టాయి.రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ను ఆ పదవి నుంచి తొలగించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

క్యామ మల్లేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఉత్తమ్.ఇవాళే జవాబు ఇవ్వాలని ఆదేశించారు.

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి గతంలో పోటీ చేసి.గ్రూప్‌లతో ఓటమిపాలైన క్యామ.

Advertisement

ఈ సారి కూడా పట్నం సీటును ఆశించారు.

కానీ అది మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.దీంతో ఏఐసీసీ నేతలపై క్యామ మల్లేష్ మండిపడుతూ.సీటు కోసం రూ.3 కోట్లు అడిగారంటూ ఆరోపించారు.దీనికి సంబంధించిన ఓ ఆడియో టేపును కూడా ఆయన విడుదల చేశారు.

క్యామ మల్లేష్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహంచి షోకాజ్ నోటీసులు ఇచ్చింది టి.పీసీసీ.ఇవాళ రాత్రిలోగా వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు