మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తాం అంటున్న కాంగ్రెస్

సుదీర్ఘకాలం పాటు భారత దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్.ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థాయి సీట్లను కూడా గెలవలేక రెండవసారి ఎన్నికైంది .

అలాంటి కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోకుండా దేశ వ్యతిరేక స్టేట్ మెంట్ ఇస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటుంది.ఇక తాజాగా కాంగ్రెస్ ఒక విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చింది.

అదేంటో ఇప్పుడు చూద్దాం.స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులతో కాశ్మీర్ భారత్ నెత్తిపై కుంపటిలా తయారైంది.

Congress Leaders Sensational Statement On Article 370, Article 370, Jammu And Ka

దానిని గత భారత ప్రభుత్వాలు సరి చేద్దాం అనుకున్న ప్రతిసారి అక్కడ ప్రాంతీయ పార్టీలు కాశ్మీరీల ను రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేవారు.దానితో ప్రభుత్వాలు ఈ విషయానికి భయపడి సుదీర్ఘకాలంపాటు వదిలేశాయి.

కానీ నరేంద్ర మోడీ సర్కార్ సుందరమైన కాశ్మీర్లో జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి ఆర్టికల్ 370ని రద్దు చేశారు.ఇప్పుడు ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ అధిష్టానం పెదవి విరిచింది.

Advertisement

తమ వైఖరేంటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని సిపిఐ, సిపిఎం,పీడీపీ ఎన్సీలతో కలిసి జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేసింది.

ఒకప్పుడు కార్మికుల హక్కుల కోసం పోరాడిన కమ్యూనిస్టు పార్టీలు తమ ఉదారవాదంతో చేసిన కొన్ని కార్యక్రమాలు దేశ వ్యతిరేకమని తెలిసిన వెనక్కి తగ్గకుండా మొండిగా ముందుకు వెళ్లారు అందుకే దేశ ప్రజలు వాళ్ళను పక్కన పెట్టారు.తాజాగా ఆ లిస్ట్ లో చేరడానికి కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందనట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు