ఏ పార్టీలోనూ లేని విచిత్రమైన పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లో కనిపిస్తుంది.ఆ పార్టీలో వాక్ స్వాతంత్రం ఉన్న నాయకులు ఎక్కువ.
ఎవరికివారు తామే సీనియర్ నాయకులం అని గొప్పలు చెప్పుకుంటూ, అధిష్టానం పెద్దల వద్ద తమకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు .ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనా, మరోసారి తెలంగాణాలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా , పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష సీనియర్ నాయకులు చాలామందిలో కనిపించడం లేదు.గ్రూపు రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ పార్టీని మరింత గా డామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ బలం పెంచుకుంటుంది.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
ఈ యాత్ర తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఉత్చాహం పెరిగింది.ఇక ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.50 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగుతోంది.మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు బట్టు విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారు.
ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కు తెలంగాణలో ప్రజాబలం పెరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఆకస్మాత్తుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాదు ఎన్నికల తరువాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలవక తప్పదని ఆయన జోస్యం చెప్పారు.బిజెపి తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేయాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవక తప్పదంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు ఏ పార్టీకి 60 కి మించి సీట్లు రావని, ఒక సీనియర్ పొలిటిషన్ గా తాను ఈ మాటలు చెబుతున్నానని అన్నారు.అంతే కాదు కాంగ్రెస్ పైన ఆయన సంచల వ్యాఖ్యలు చేశారు.
ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ పార్టీ గెలవదని పరోక్షంగా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు.ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి ఉంది.ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ తెలంగాణలో బలపడుతున్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించడంతో పాటు , పార్టీకి చేయాల్సినంత స్థాయిలో డ్యామేజ్ చేస్తాయని, ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతలంతా వెంకటరెడ్డి పై ఫైర్ అవుతున్నారు .వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ ను కూడా గందర గోళానికి గురిచేసాయని, ఎన్నికల సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్లు ఫైర్ అవుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy