పాకిస్తాన్ ని పొగిడి భారత్ ని తిట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత! ఆర్మీకి అవమానం

సరిహద్దులో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఒప్పందాలు అతిక్రమించి భారత్ పై కాల్పులు జరుపుతూ ఆర్మీ, ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది.

మరో వైపు టెర్రరిస్ట్ లని పెంచి పోషిస్తూ, వారిని ఇండియాపైకి పంపిస్తూ కుట్రలు చేస్తుంది.

ఇక పాకిస్తాన్ కుట్రపూరిత వ్యక్తిత్వం గురించి ప్రపంచం అంతా తెలుసు.కాని మొదటి నుంచి పాకిస్తాన్ ఇండియాలో టెర్రరిస్ట్ ఎటాక్స్ చేసిన, ప్రజల ప్రాణాలు పోయిన ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఆ దేశానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ వస్తుంది.

ఇప్పుడు మరో సారి సీనియర్ నేత చిదంబరం వాఖ్యలతో అది మరో సారి రుజువైంది.పాకిస్తాన్‌ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ముందుగా భారత్‌ పాక్‌పట్ల తన ప్రవర్తనను మార్చుకోవాలని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.మనం బలమైన సైన్యాన్ని తయారుచేసుకునేది యుద్ధం చేయడానికి కాదు.

యుద్ధంరాకుండా నివారించడానికే.ఈ విషయం తెలుసుకున్నప్పుడు అని సమస్యలు పరిష్కారమైపోతాయి.

Advertisement

అంటూ చెప్పిన చిదంబరం తన మాటల ద్వారా ఇండియా ఆర్మీ పాకిస్తాన్ ని రెచ్చగొడుతుంది అని పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు అయ్యింది.ఇప్పుడు చిదంబరం వాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారి బీజేపీ విమర్శలకి అస్త్రం ఇచ్చినట్లు అయ్యింది.

అసలే పాకిస్తాన్ మీద రగిలిపోతున్న ప్రజలకి చిదంబరం వాఖ్యలు ఆజ్యం పోసినట్లు అయ్యింది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు