రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ నిరసనలు

­ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారు.

ఇటు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష కొనసాగనుంది.అయితే కాంగ్రెస్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ట్రాఫిక్ సమస్యల కారణంగా అనుమతిని ఇవ్వడంలేదని తెలిపారు.ఈ క్రమంలో రాజ్ ఘాట్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

కాంగ్రెస్ నేతలు అక్కడకు భారీగా చేరుతున్నారని తెలుస్తుంది.దీంతో సీఆర్పీఎఫ్, ఆర్ ఏ ఎఫ్ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు