కొత్త టీమ్‎పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కసరత్తు

ఏఐసీసీ నూతన అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పదవీ బాధ్యతలు స్వీకరించగానే కొత్త టీమ్ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు.

ఇప్పటికే పాత టీమ్ లో ఉన్న సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రాజీనామాలు చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని ఖర్గే త్వరలోనే ప్రకటించనున్నారు.అయితే, కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉదయమే మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

వెంటనే ఆయన పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారు.

Advertisement

తాజా వార్తలు