Congress Paanch Nyay : పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో..: కేసీ వేణుగోపాల్

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ భేటీలో కాంగ్రెస్ ( Congress )అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ మేరకు మ్యానిఫెస్టోకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ) ఆమోదంతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల కానుంది.కాగా పాంచ్ న్యాయ్( Paanch Nyay ) పేరుతో ఐదు అంశాలతో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ఖరారు చేసింది.ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలతో జనంలోకి వెళ్తామని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.

స్వామినాథన్ సిఫార్సుల ఆధారంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామన్న ఆయన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.కొత్తగా 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

Advertisement

అదేవిధంగా నిరుద్యోగులకు రూ.లక్ష భృతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు