పీక కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేష్ !

తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనదైన శైలిలో పొలిటికల్ హాస్యం పండించిన బండ్ల గణేష్ .చాలా ఉత్సాహంగా కనిపించారు.

అంతే కాదు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ.

చాలా ధీమాగా.మాట్లాడేశారు.

ఆ సందర్భంగా.ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణాలో అధికారంలోకి రాకపోతే.

Advertisement

పీక కోసుకుంటా.అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అంతే కాదు.ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే .మీ మీడియా వారే 7 o క్లాక్ బ్లేడ్ తీసుకురండి నేను కోసుకుని చూపిస్తా అంటూ.మాట్లాడాడు.

కానీ.ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఓటమి చెంది, టిఆర్ఎస్ గెలవడంతో ఆయన ఎక్కడ అంటూ.అంతా ప్రశ్నించారు.

దీనిపై గణేష్ స్పందిస్తూ తాను అజ్ఞాతంలో లేనని ,కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించుకున్నానని తిరుమలలో చెప్పారు.మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది.

అరే కోపంలో వంద అంటాం సార్‌.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా.

Advertisement

చాలా అంటాం ఇవన్నీ మాములే.ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను.

ఇప్పుడేం చేయమంటారు.కాన్ఫిడెన్స్‌ కాస్త ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అయ్యింది దానికి ఏం చెబుతాం అంటూ .గణేష్ వ్యాఖ్యానించారు.