మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే..: మంత్రి పువ్వాడ

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

అదేవిధంగా జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ దేనని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామన్నారు.ఇక జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఉన్నదేనన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయలేదని చెప్పారు.కాంగ్రెస్ గ్యారెంటీలను బీఆర్ఎస్ కాపీ కొట్టి మ్యానిఫెస్టో ప్రకటించిందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్నే కాంగ్రెస్ కాపీ కొట్టిందని తెలిపారు.ఈ తరహాలోనే కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు.

Advertisement
సిద్దు జొన్నలగడ్డ పరిస్థితి ఏంటి..?

తాజా వార్తలు