తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.

ఈ మేరకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న డీకే శివకుమార్ రేపు సాయంత్రం వరకు తెలంగాణలోనే ఉండనున్నారు.ఫలితాల నేపథ్యంలో అవసరం అయితే ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలించాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రతి అభ్యర్థి వెంటన ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు.అలాగే రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ ను డీకే శివకుమార్ పరిశీలించనున్నారు.

మరోవైపు అభ్యర్థులు అంతా అలర్ట్ గా ఉండాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు