ఢిల్లీలో కాంగ్రెస్ భారీ బహిరంగ స‌భః శైల‌జానాథ్

అనంత‌పురం జిల్లాలో ఏపీసీసీ అధ్య‌క్షుడు శైల‌జానాథ్ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ నేత‌లు వినూత్న నిర‌స‌న‌కు దిగారు.వైసీపీ ప్ర‌భుత్వ హయాంలో రైతులు దోపిడీకి గుర‌వుతున్నార‌ని ఆరోపించారు.

పెంచిన నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ‌ర‌ల పెంపు కార‌ణంగానే నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరిగాయ‌ని విమ‌ర్శించారు.

దీంతో సామాన్య ప్ర‌జ‌ల‌పై పెను భారం ప‌డుతోంద‌న్నారు.ఈ నేప‌థ్యంలో నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెంపును నిరసిస్తూ దేశ రాజ‌ధాని ఢిల్లీలో సెప్టెంబ‌ర్ 4న భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు