Congress BRS : చేరికలపై కాంగ్రెస్ ఫోకస్ .. బీఆర్ఎస్ కు ట్రబుల్స్

రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బి ఆర్ ఎస్ ను మరింత బలహీనం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.

దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని,  ఎన్నికలకు ముందే భారీ చేరికల ద్వారా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి బీర్ ఎస్ ను బలహీనపరచాలనే వ్యూహం తో కాంగ్రెస్ ఉంది.

దీనిలో భాగంగానే చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకుంది.క్షేత్రస్థాయి నుంచి,  రాష్ట్ర స్థాయి వరకు కీలక నాయకులందరినీ పార్టీలో చేర్చుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

బీఆర్ఎస్, బిజెపి( BRS, BJP )లలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేరే విధంగా అనేక హామీలు ఇస్తూ,  వారిని పార్టీలో చేర్చుకునే పనికి శ్రీకారం చుట్టారు.

 ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు రాని కొంత మంది నేతలతో పాటు,  అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎంపీలను చేర్చుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.అలాగే బీఆర్ఎస్ లో చాలా కాలం నుంచి కీలకంగా పనిచేస్తున్న సరైన పదవులు ప్రాధాన్యం లభించని నేతలను గుర్తించి, కాంగ్రెస్ లో వారిని చేరాలని పదవులు , ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇస్తున్నారు .కొంతమంది కీలక నాయకులను రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్వయంగా పార్టీలో చేర్చుకుంటూ ఉండగా,  మరికొంతమందిని ఆయా జిల్లాల ఇన్చార్జిల మంత్రుల సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.ఇప్పటికే కొంతమంది పార్టీలో చేరిపోగా,  మరికొంతమంది సరైన సమయంలో కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నారు.

Advertisement

ఈ విధంగా చూసుకుంటే పఠాన్ చెరువుకు చెందిన నీలం మధు, మాజీ మేయర్ బొంతు రామ్మోన్ తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 అలాగే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar )ఎంపీలు రవిచంద్ర మాలోతు కవిత , కవిత , ఎడ్ల సుధాకర్ రెడ్డి,  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజయ్య గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు