వచ్చే నెల 9న కాంగ్రెస్ తొలి కేబినెట్ సమావేశం..: రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలో డిసెంబర్ 9వ తేదీన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీలపై ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు.అదే రోజున సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమం కూడా ఉంటుందన్న రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలుపై తొలి సంతకం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement