టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు ఈడీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఫిర్యాదు చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఈడీ అధికారులు నిష్ఫక్షపాతంగా విచారణ జరిపించాలని నేతలు కోరారు.

అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.అవినీతిని ప్రశ్నించినందుకు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సెక్యూరిటీని దాటుకుంటూ పేపర్లు సేవ్ చేసిన కంప్యూటర్ దగ్గరకు వెళ్లడం అంతా సులువైన విషయం కాదన్న ఆయన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు