నేడు ప్రారంభంకానున్న‌ కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న భార‌త్ జోడో యాత్ర ప్రారంభంకానుంది.ఈరోజు సాయంత్రం త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో ప్రారంభం అయ్యే ఈ యాత్ర‌.

జమ్మూక‌శ్మీర్ లోని శ్రీన‌గ‌ర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.12 రాష్ట్రాల్లో 150 రోజుల పాటు 3,570 కిలో మీట‌ర్ల మేర రాహుల్ పాద‌యాత్ర చేయ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెంట 118 మంది నేత‌లు ఉండ‌నున్నారు.

ఈ భార‌త్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.ఈ క్ర‌మంలో దివంగత ప్రధాని, త‌న తండ్రి రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ నివాళి అర్పించారు.

తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న రాజీవ్ స్మారకాన్ని సందర్శించారు.తొలుత ఒక మొక్కను నాటిన రాహుల్ త‌న తండ్రి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు