Congress Ajay Maken : కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లు సీజ్..: అజయ్ మాకెన్

కాంగ్రెస్ ( Congress ) సంచలన ఆరోపణలు చేసింది.

పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు సీజ్ అయ్యాయని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్( Ajay Maken ) తెలిపారు.

కాంగ్రెస్ తో పాటు యూత్ కాంగ్రెస్( Youth Congress ) బ్యాంక్ అకౌంట్లను ఐటీ సీజ్ చేసిన విషయాన్ని అజయ్ మాకెన్ వెల్లడించారు.యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు రూ.210 కోట్లు రికవరీ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అడుగుతుందని పేర్కొన్నారు.

ఎన్నికలకు రెండు వారాల ముందే తమ అకౌంట్లను సీజ్ చేశారన్న ఆయన ఇది ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్లేనని ఆరోపించారు.అయితే తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని చెప్పారు.దీని వలన విద్యుత్ బిల్లు చెల్లించడంతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు.

ఇది రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భారత్ న్యాయ యాత్రతో పాటు పార్టీ కార్యకలాపాలు అన్నింటిపైనా ప్రభావం పడుతోందని వెల్లడించారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు