గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్..!

గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది.ఈ మేరకు ఎనిమిది అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

ప్రస్తుతం భారత్ జోడో యాత్ర నిర్వహిస్తోన్న ఆయన ఈ క్రమంలో మేనిఫెస్టో అంశాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.రూ.500 లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, యువతకు 10 లక్షల ఉద్యోగాలతో పాటు రూ.3 లక్షల వరకూ రైతులకు రుణమాఫీ వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.ఈ సందర్భంగా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వంచన నుంచి మనల్ని మనం కాపాడుకుందాం.

రాష్ట్రంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడదామంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement