ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఇలా ప్రకటించబడిందో లేదో అప్పుడే ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్టులు వీర విహారం చేస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు అధికార బారాసకు అనుకూలంగా ఉన్న వాతావరణం ఇప్పుడు హస్తం పార్టీ వైపు తిరిగిందని గాలి మారింది అన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్లు అంచనా వేస్తున్నాయి.
లోక్ పాల్ సర్వే మరియు ఏబీపీ సి వోటర్ సర్వే కాంగ్రెస్ ( Telangana congress )దే అదికారం అంటూ తేల్చేశాయి.అధికార బారాసకు 45 నుంచి 50 సీట్లు వస్తే కాంగ్రెస్కు 48 నుంచి 60 వరకు రావొచ్చు అంటూ ఈ సర్వేలు అంచనా వేస్తున్నాయి.
భాజపాక ( BJP )అయితే ఐదు నుంచి 11 మధ్యలో ఫలితాలు వస్తాయని అంచనాల సారాంశం.అయితే వీటిని పేయిడ్ సర్వే లంటూ అధికార బారాస కొట్టి పాడేస్తున్నప్పటికీ కర్ణాటక ఎన్నికలలో ఈ సర్వేల ఫలితాలు విశ్వసనీయంగా ఉండడంతో ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ మ్యాజిక్ చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి విషయం లో భారతీయ రాష్ట్ర సమితి( BRS party ) కి మంచి మార్కులే పడినప్పటికీ అవినీతి ఆరోపణలు కూడా బారాస ఎమ్మెల్యేలపై భారీ ఎత్తున వచ్చాయి.ముఖ్యంగా భూముల కబ్జాలు, ముడుపుల వ్యవహారాలలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.అంతేకాకుండా కేంద్ర లో అధికారం మోజుతో భారీ ఎత్తున ఇక్కడ అవినీతి చేసిన సొమ్మును ఖర్చు పెట్టారని, ఇతర పార్టీలకు ఫండింగ్ చేయడానికి ఆఫర్లు ఇచ్చారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
దాంతో తెలంగాణ ఓటర్ కు బారాస పై విముఖత కలిగిందని కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో గ్రౌండ్ లెవెల్ లో వోటర్ ఉన్నాడన్నది రాజకీయ పరిశీలకుల అంచనా .
అయితే ఇప్పటికిప్పుడు బారాస కు వచ్చిన ముప్పేమీ లేదని ఇంకా 50 రోజుల సమయం ఉండడంతో పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి ఇంకా అదికార పార్టీకి అవకాశాలు మిగిలే ఉన్నాయని ఉన్న ఈ తక్కువ సమయంలో ఓటరును ప్రసన్నం చేసుకుంటే గనక హ్యాట్రిక్ రిపీట్ చేయడం పెద్ద కష్టం కాదని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు.అయితే ఎన్నికలు దగ్గరకు రావడం పార్టీల ఎత్తులు పై ఎత్తులతో ఇక్కడ రోజుకొక పార్టీ వైపు గాలి మళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదన్నట్టుగా ఉంది .మరి చివరి వరకు పట్టు నిలుపుకునేవారే విజేత గా మారతారు .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy