కన్ఫ్యూజ్‌లో మెగా ఫ్యాన్స్‌

మెగా ఫ్యాన్స్‌ గతంలో ఎప్పుడు లేనంతగా గందరగోళంకు గురి అవుతున్నారు.

ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు వస్తుందో అని, ఆ సినిమాకు దర్శకుడు ఎవరో అంటూ పలు రకాల అనుమానాలు మెగా ఫ్యాన్స్‌లో ఉన్నాయి.

అయితే ఇటీవల చిరంజీవి 150వ సినిమాకు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటూ ఖచ్చితమైన సమాచారం అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.ప్రస్తుతం పూరి చేస్తున్న సినిమా పూర్తి కాగానే స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో పడే అవకాశాలున్నాయని అంతా భావించారు.

కాని తాజాగా పూరి తన తర్వాత సినిమాను మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌తో అని తేల్చి పడేశాడు.తాజాగా ‘జ్యోతి లక్ష్మి’ సినిమాను పూర్తి చేసిన పూరి జగన్నాధ్‌ వచ్చే నెల నుండి వరుణ్‌ తేజ్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.

ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.ఒక వైపు క్రిష్‌ దర్శకత్వంలో ‘కంచె’ సినిమాలో నటిస్తోన్న వరుణ్‌ తేజ్‌ మరో సినిమాగా పూరితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement

వరుణ్‌తో పూరి సినిమా మొదలు పెడితే ఇక చిరుతో సినిమా చేయడం కష్టమే అనే చర్చ జరుగుతోంది.ఆగస్టులో చిరు 150వ సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి చిరు 150వ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరు కూడా కన్ఫ్యూజ్‌లో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు