KTR : సికింద్రాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ..: కేటీఆర్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం( Secunderabad)లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.అదేవిధంగా సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని

ధీమా వ్యక్తం చేశారు.

కష్టకాలంలో నిలబడ్డవాడే నిజమైన నాయకుడని చెప్పారు.ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే దానం నాగేందర్( Danam Nagender ) గురించి తాను ఎక్కువగా మాట్లాడనని తెలిపారు.

దానం బీఆర్ఎస్( BRS ) కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లోకి వెళ్లారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే దానంను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ ను వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు.

అంతేకాకుండా దానం విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తామని తెలిపారు.ద్రోహం చేసిన నాయకులకు బుద్ధిచెప్పాలని స్పష్టం చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు